పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పర్యటించారు. లాక్డౌన్తో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలకు ఎమ్మెల్యే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
'ప్రజారోగ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యం' - groceries to needy in peddapalli
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదలకు పెద్డపల్లి జిల్లా గోదావరిఖనిలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
గోదావరిఖనిలో సరుకుల పంపిణీ
రామగుండం కార్పొరేషన్ పరిధిలో పేదల ఆకలి తీర్చేందుకు విజయమ్మ ఫౌండేషన్ కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేదలకు అండగా ప్రతి ఒక్కరు నిలవాలని కోరారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ కన్నూరి సతీశ్ కుమార్, దాతు శ్రీనివాస్, దయానంద్ గాంధీ, వైద్యులు అద్దంకి శరత్, నాయకులు నూతి తిరుపతి, ఇరుగురాల్ల శ్రవణ్, అబ్బాస్ పాల్గొన్నారు.