తెలంగాణ

telangana

ETV Bharat / state

బాధితుల్లో మనోస్థైర్యం నింపేందుకు ఎమ్మెల్యే భరోసా యాత్ర - తెలంగాణ వార్తలు

కరోనా బాధితుల్లో మనోస్థైర్యం నింపేందుకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భరోసా యాత్ర చేపట్టారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూ... వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. కష్టకాలంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ramagundam mla korukanti chandar, mla bharosha yatra
ఎమ్మెల్యే భరోసా యాత్ర, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

By

Published : May 15, 2021, 8:11 AM IST

కరోనా బాధితులకు మనోస్థైర్యాన్ని నింపేందుకు భరోసా యాత్ర చేపట్టినట్లు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా జనగామ గ్రామంలో మేయర్ అనిల్ కుమార్, కార్పొరేటర్ కవితతో కలిసి సందర్శించారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు పౌష్టికాహారం అందించారు. నియోజకవర్గ పరిధిలో సుమారు రెండు వేల మంది వైరస్ బారిన పడ్డారని, వారికి మెరుగైన వైద్యం అందించేందుకు భరోసా యాత్ర చేపట్టామని వివరించారు.

వైద్య సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరుగుతూ బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో అన్ని విధాల అండగా ఉంటామని ఎమ్మెల్యే చందర్ హామీ ఇచ్చారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.

ఇదీ చదవండి:కరుణ చూపని ఆస్పత్రులు.. గాల్లో కలిసిన రెండు ప్రాణాలు

ABOUT THE AUTHOR

...view details