పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు పెద్దన్న సీఎం కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆడపిల్లలు పుడితే అమ్ముకునే పరిస్థితులు గతంలో ఉండేవని... నేడు మహాలక్ష్మి పుట్టిందని సంతోషపడే పరిస్థితులను సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని కొనియాడారు. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలోని రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రామగుండం మండలానికి చెందిన 284 మందికి చెక్కులను, పాలకుర్తి మండలానికి చెందిన 40 మందికి కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు.
పేదింటి పెళ్లిలకు పెద్దన్న సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే కోరుకంటి చందర్ - తెలంగాణ వార్తలు
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేసి సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలుస్తున్నారని కొనియాడారు. రామగుండం మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
పేదింటి పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేసి పెద్దన్నగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పేద కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని, ఆడపిల్లల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయని అన్నారు. ప్రజలందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, తహసీల్దార్ సదానందం, రమేశ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు