నియోజకవర్గంలోని మహిళలకు స్వయం ఉపాధి కల్పనే విజయమ్మ ఫౌండేషన్ లక్ష్యమని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం నగరపాలక 6వ డివిజన్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ప్రతి మహిళ ఆర్థిక స్వాతంత్య్రం పొందాలి: కోరుకంటి - విజయమ్మ ఫౌండేషన్ వార్తలు
నియోజకవర్గంలోని మహిళలకు స్వయం ఉపాధి కల్పనే విజయమ్మ ఫౌండేషన్ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మహిళా సాధికారిత కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఆడపడుచుల కళ్లల్లో ఆనందం నింపాలనే సంకల్పంతో కార్పొరేషన్లోని యాభై డివిజన్లలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రతి మహిళ ఆర్థిక స్వాతంత్య్రం పొందినట్లయితే ఆ కుటుంబం క్షేమంగా ఉంటుందని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ధ్రువీకరణ పత్రాలతో పాటు ఉచితంగా కుట్టుమిషన్లను విజయమ్మ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కొలువుల పేరుతో యువతకు వల