తెలంగాణ

telangana

By

Published : Jan 17, 2022, 5:36 AM IST

Updated : Sep 30, 2022, 10:29 AM IST

ETV Bharat / state

Manochaitnya Center బుద్దిమాంద్యంతో పుట్టినా అక్కున చేర్చుకుంటున్న మనోచైతన్య

Manochaitnya Center అమ్మా అని పిలవలేరు.. ఆకలవుతోందని అడగలేరు. బుద్ధిమాంద్యంతో పుట్టడంతో.అయినవాళ్లే వారిని కాదనుకున్నారు. అయినా మేము ఉన్నామంటూ భరోసా కల్పిస్తోంది రామగుండం మనోచైతన్య మానసిక వికలాంగుల కేంద్రం. వారికి కడుపునిండా అన్నం పెట్టడంతోపాటు... పాఠాలు చెబుతూ ఉపాధి మార్గాన్ని చూపిస్తోంది.

Manochaitnya
Manochaitnya

Manochaitnya Center: వీరంతా లోకం పోకడ తెలియని అమాయకులు. వయసు పెరిగినా... మానసిక ఎదుగుదల లేని చిన్నారులు. సొంతగా ఆలోచించలేరు. అయితేనేం వారికి మేమున్నామంటూ మనోచైతన్య మానసిక వికలాంగుల కేంద్రం భరోసా కలిస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో 1987లో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటైన మనో చైతన్య వికలాంగుల కేంద్రం బుద్ధిమాంద్యంతో జన్మించినవారికి అండగా నిలుస్తోంది.

అయినవారే కాదనుకున్నా...తల్లిదండ్రులు లేనివారు, కుటుంబీకులే కాదనుకుని వదిలివెళ్లినవారికి అన్నం పెడుతూ చదువు నేర్పుతున్నారు. మొదట్లో 30 మందితో మొదలైన ఆ కేంద్రం ఇప్పుడు 150 మందికి ఆశ్రయం కల్పిస్తోంది. ఇందులోని దివ్యాంగులకు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడంతోపాటు వారికి అర్థమైన, గ్రహించగలిగిన పనులు నేర్పుతూ... ఉపాధి కల్పిస్తున్నారు.

చేయూతనివ్వండి...బుద్ధిమాంద్యంతో పుట్టినా ఉపాధ్యాయుల శిక్షణతో... కొందరు వారికి కేటాయించిన పనిలో విశేషంగా రాణిస్తున్నారు. పిల్లల దీనస్థితి చూసి తల్లడిల్లినవారు... ఆశ్చర్యపోయేలా కొత్తవిద్యలు నేర్చుకుంటున్నారు. మానసిక కేంద్రానికి ప్రభుత్వం అరకొరగా నిధులు ఇస్తుందని చెబుతున్న నిర్వహకులు... సరిపడా నిధులిచ్చి చేయూత కల్పించాలని కోరుతున్నారు. చేయూత అందిస్తే ఇతరులకు ఏం తీసిపోమంటూ వారు నిరూపిస్తున్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Sep 30, 2022, 10:29 AM IST

ABOUT THE AUTHOR

...view details