పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు రామగుండం డీసీపీ శరత్ చంద్ర పవార్. లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనదారులను ఆపి.. వారి పత్రాలను పరిశీలించారు. మొదటి సారి వచ్చిన వారిని వదిలేసి రెండోసారి వచ్చిన వారికి జరిమానాలు విధించారు.
లాక్డౌన్ అమలును పరిశీలించిన రామగుండం డీసీపీ - రామగుండం డీసీపీ శరత్ చంద్ర పవార్ తాజా వార్తలు
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు రామగుండం డీసీపీ శరత్ చంద్ర పవార్. పట్టణంలో లాక్డౌన్ పక్కాగా అమలవుతోందని, అనవసరంగా బయటకు వచ్చే వారికి జరిమానాలు విధిస్తున్నట్లు ఆయన తెలిపారు.
లాక్డౌన్ అమలును పరిశీలించిన రామగుండం డీసీపీ
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రభుత్వం ఇచ్చిన సడలింపు సమయాన్ని భౌతిక దూరం పాటిస్తూ ఉపయోగించుకోవాలని డీసీపీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. అత్యవసరంగా ప్రజలు ఎవరైనా బయటికి రావాలనుకుంటే, ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే కచ్చితంగా ఈ పాస్ ద్వారానే వెళ్లాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.