మహాశివరాత్రిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా రామగుండం సీపీ సత్యనారాయణ... వేలాల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం బందోబస్త్ ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. మల్లన్న దర్శనం చేసుకున్న భక్తులు ఆధ్యాత్మిక అనుభూతితో... ఆనందంగా ఇంటికెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వేలాల మల్లన్నను దర్శించుకున్న రామగుండం సీపీ - Ramagundam CP visited Velala Mallanna
మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వేలాల మల్లికార్జున స్వామిని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

వేలాల మల్లన్నను దర్శించుకున్న రామగుండం సీపీ
వాహనాల రద్దీ పెరిగితే ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాలని సీపీ సూచించారు. ఆయన వెంట జైపూర్ ఏసీపీ నరేందర్, శ్రీరాంపూర్ సీఐ కోటేశ్వర్, చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కీసరగుట్టకు పోటెత్తిన భక్తజనం.. అభిషేకాలతో తన్మయత్వం