పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు సుల్తానాబాద్ మండలంలోని దుబ్బపల్లి చెక్ పోస్ట్ వద్ద సీపీ వాహన తనిఖీలు నిర్వహించారు.
లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నాం: సీపీ సత్యనారాయణ - RAMAGUNDAM CP VEHICLE CHECKING IN LOCKDOWN
రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో తనిఖీలు నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్ల మీదకు వచ్చిన వాహనాలను సీజ్ చేశారు.
సీపీ సత్యనారాయణ
ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రోడ్ల మీదకు వచ్చిన పలు వాహనాలను కమిషనర్ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కొవిడ్ నిబంధనలను అమలు చేస్తూనే కరోనా వ్యాప్తిపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. అనంతరం జర్నలిస్టులకు పండ్లు, శానిటైజర్లు, మాస్కులు వితరణ చేశారు.
ఇవీ చూడండి:జూన్ వరకు కొవిడ్ మార్గదర్శకాలు కొనసాగింపు
Last Updated : May 28, 2021, 11:54 PM IST
TAGGED:
RAMAGUNDAM CP