పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై రామగుండం సీపీ సత్యనారాయణ.. పోలీసు అధికారులతో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. రహదారిపై ప్రయాణించే వాహనాల అనుమతి పత్రాలను పరిశీలించారు. లాక్డౌన్ నిబంధనలను ప్రజలందరూ పాటించి కరోనా కట్టడికి కృషి చేయాలని కోరారు.
లాక్డౌన్కు ప్రజలందరూ సహకరించాలి: సీపీ - రామగుండం సీపీ సత్యనారాయణ తాజా వార్తలు
ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను ప్రజలందరూ పాటించి.. కరోనా కట్టడికి కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై పోలీసు అధికారులతో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు.
వాహన తనిఖీ చేస్తున్న రామగుండం సీపీ సత్యనారాయణ
కొంతమంది ఎమ్మెల్యే స్టిక్కర్లు కారుకు అంటించుకుని వెళ్తున్నారని తెలిపారు. లాక్డౌన్ మొదటిరోజు.. నిబంధనలు అతిక్రమించిన 863 మందికి జరిమానాలు వేసినట్లు తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో రవాణా నిలిపివేశామని.. కేవలం వైద్య సదుపాయాలకు వచ్చే వాహనాలను అనుమతిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:కరోనాను ఎదుర్కోవటంలో మాస్కులే శ్రీరామ రక్ష
Last Updated : May 17, 2021, 6:24 AM IST