తెలంగాణ

telangana

By

Published : Jun 12, 2021, 7:40 AM IST

ETV Bharat / state

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై లాఠీ ఝుళిపించిన పోలీసులు

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని వదిలే ప్రసక్తే లేదని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆకస్మికంగా పర్యటించి లాక్​డౌన్ అమలు తీరును పరిశీలించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని సూచించారు.

ఉల్లంఘిస్తే వదిలే ప్రసక్తే లేదు: రామగుండం సీపీ
ఉల్లంఘిస్తే వదిలే ప్రసక్తే లేదు: రామగుండం సీపీ

లాక్​డౌన్ సడలింపు సమయంలోనే ప్రజలు అన్ని పనులు చేసుకోవాలని రామగుండం సీపీ సత్యనారాయణ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో రాత్రి ఆకస్మికంగా పర్యటించి లాక్​డౌన్​ అమలు తీరును పరిశీలించారు.

రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న వారికి కరోనా రాపిడ్ టెస్టులు చేయించారు. సుమారు 15 మందికి టెస్ట్​లు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్ రాకపోవడంతో... రాత్రిపూట బయటికి రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారిపై లాఠీ ఝుళిపించారు. ఇప్పటివరకు రామగుండం కమిషనరేట్ పరిధిలో 6 వేల వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. 40 వేల కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.

కమిషనరేట్ పరిధిలో కరోనా పాజిటివ్ రేటు 50శాతం నుండి 4 శాతంకు తగ్గిందని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య శాఖతో సమన్వయంగా పోలీసులు నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 19 వరకు కఠినంగా లాక్​డౌన్​ను అమలు చేస్తామని... ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని సూచించారు.

ఇదీ చదవండి:CM KCR: 19 నుంచి పల్లె, పట్టణప్రగతి పనుల ఆకస్మిక తనిఖీ

ABOUT THE AUTHOR

...view details