తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలే' - లాక్‌ డౌన్ నియమాలపై వ్యాపారులకు అవగాహన

ఎవరైనా లాక్‌ డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి జిల్లా రామగుండం సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖనిలో కూరగాయల మార్కెట్ వ్యాపారులకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి అవగాహన కల్పించారు. కొవిడ్ నియమాలు పాటిస్తూ వ్యాపారులు సహకరించాలన్నారు.

Ramagundam cp satyanarayana
గోదావరిఖనిలో రామగుండం సీపీ సత్యనారాయణ

By

Published : May 20, 2021, 3:40 PM IST

ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల వరకే దుకాణాలు మూసివేయాలని పెద్దపల్లి జిల్లా రామగుండం సీపీ సత్యనారాయణ సూచించారు. కరోనా కట్టడికి వ్యాపారులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖనిలోని కూరగాయల మార్కెట్ వ్యాపారులకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి అవగాహన కల్పించారు.

ప్రస్తుతం కరోనా తీవ్రరూపం దాల్చుతున్న క్రమంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సీపీ, ఎమ్మెల్యే సూచించారు. కోల్ బెల్ట్ ప్రాంతంలో కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందుతోందన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వ్యాపారులు వ్యవహరించాలన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలుంటాయని సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, సీఐలు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'అధిక రుసుం వసూల్ చేసే ఆస్పత్రులపై చర్యలు'

ABOUT THE AUTHOR

...view details