అత్యవసరమైతేనే బయటకు రావాలని, అనవసరంగా రోడ్లపై తిరిగి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో రాత్రివేళలో లాక్డౌన్ అమలు తీరును సీపీ పరిశీలించారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లపై తిరుగుతున్న ఆకతాయిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.
'అత్యవసరమైతేనే బయటకు రావాలి.. లేదంటే కఠిన చర్యలే'
అత్యవసరమైతేనే రోడ్ల మీదకు రావాలని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో రాత్రివేళలో లాక్డౌన్ అమలు తీరును ఆయన పరిశీలించారు.
పెద్దపల్లిలో లాక్డౌన్, సీపీ సత్యనారాయణ
ఈ కరోనా కాలంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. ఉద్యోగులు తమ ఐడీ కార్డును తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ, ఒకటో పట్టణ సీఐ రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్‌తో పాటు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Digital survey: 'డిజిటల్ సర్వేతో పొరపాట్లు జరిగే ఆస్కారం ఉండదు'