తెలంగాణ

telangana

ETV Bharat / state

మంథని దాడి ఘటనలో ఒకరి అరెస్ట్​ - మంథని దాడి ఘటనలో ఒకరి అరెస్ట్​

ఎన్నికల అనంతరం మంథనిలో జరిగిన ఘటనలో ఒక వ్యక్తిని అరెస్ట్​ చేసినట్లు రామగుండం సీపీ తెలిపారు. అన్ని వర్గాలు సంయమనం పాటించాలన్నారు.

మంథని దాడి ఘటనలో ఒకరి అరెస్ట్​
మంథని దాడి ఘటనలో ఒకరి అరెస్ట్​

By

Published : Jan 28, 2020, 11:59 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని సర్కిల్ ఇన్​స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. పురపాలక ఎన్నికల అనంతరం మంథనిలో జరిగిన చెదురుమొదురు ఘటనలు, అరెస్టులపై, తీసుకోబోయే చర్యలను వివరించారు.

పురపాలక ఎన్నికలు ముగిసిన తర్వాత అందరూ ప్రశాంతంగా ఉండాలని, చిన్న చిన్న విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సీపీ తెలిపారు. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను అందరూ స్వాగతించాలన్నారు. నిన్న మంథనిలో జరిగిన దాడిలో ఒక వ్యక్తి అరెస్టు చేసినట్లు తెలిపిన సీపీ.. అతనిపై త్వరలో పీడీయాక్ట్ కేసు పెడతామని తెలిపారు.

ఇదీ చూడండి : ప్రేమ పెళ్లి.. 10 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి

ABOUT THE AUTHOR

...view details