పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో.. రాత్రి వేళల్లో లాక్డౌన్ అమలు తీరును స్వయంగా పరిశీలించారు పోలీస్ కమిషనర్ సత్యనారాయణ. సుమారు వంద మంది పోలీసులతో బృందాలుగా ఏర్పడి పట్టణంలోని చౌరస్తా నుంచి ప్రధాన వీధులన్నీ తిరిగి పర్యవేక్షించారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఎలాంటి కారణాలు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేశారు.
రాత్రిపూట లాక్డౌన్ అమలుతీరును పరిశీలించిన రామగుండం సీపీ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రాత్రిపూట లాక్డౌన్ అమలుతీరును పరిశీలించారు సీపీ సత్యనారాయణ. జిల్లాలో లాక్డౌన్ పటిష్ఠంగానే అమలవుతోందని తెలిపారు.
కరోనా కట్టడి కోసం ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని... అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకూడదని సీపీ సత్యనారాయణ తెలిపారు. ఒకవేళ ఎవరైనా బయటకు వస్తే... తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఎలాంటి కారణాలు లేకుండా రోడ్లపై తిరుగుతున్న 300 వాహనాలు సీజ్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఏసీపీ బాలరాజు, సీఐ రమేష్ బాబు, ప్రవీణ్ కుమార్ సుమారు 100 మంది పోలీసులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు