మంథనిలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ 29వ వర్ధంతిని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సంబురంగా జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజీవ్ ప్రధానిగా ఉన్న సమయంలో 73, 74వ రాజ్యాంగ సవరణ, స్థానిక సంస్థలకు ప్రతిపత్తి కల్పించే అంశాన్ని తీసుకొచ్చారన్నారు.
ఘనంగా రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి - మంథని తాజా వార్తలు
రాజీవ్ గాంధీ వర్ధంతి మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఘనంగా నిర్వహించారు. ఈ తరుణంలో ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నామని ఆయన అన్నారు.

ఘనంగా రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి
దేశంలో టెలికమ్యూనికేషన్ విప్లవంలో ఆయన అనేక సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని దేశంలో ప్రవేశపెట్టి అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చూట్టారని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి :దొంగతాళంతో బైక్ చోరీ