పెద్దపల్లి జిల్లా మంథని మండల విద్యాధికారి కేంద్రంలో ప్రశ్నాపత్రాలు వర్షం నీటితో తడిశాయి. ఈ నెల 25 నుంచి పరీక్షలు జరగనుండగా ప్రశ్నాపత్రాలు తడసిన విషయాన్ని సీఆర్పీలు మంగళవారం గుర్తించారు. ఆరు నుంచి పదవ తరగతి వరకు ప్రశ్నపత్రాలు భద్రంగానే ఉన్నాయని మంథని విద్యాధికారి ఎం.లక్ష్మి చెప్పుకొచ్చారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రశ్నాపత్రాలు తడిసిపోయాయని పేర్కొన్నారు. విద్యా వనరుల కేంద్రం ఆవరణలో ఆరబెట్టారు. వర్షం కురిసినప్పుడల్లా విద్యావనరుల కేంద్రంలోకి నీరు చేరుతుంది. గతంలో కూడా పుస్తకాలు పెద్ద ఎత్తున తడిసిన సందర్భాలున్నాయి.
విద్యాధికారి కార్యాలయంలో తడిసిన ప్రశ్నా పత్రాలు - పెద్దపల్లి జిల్లా మంథని మండల విద్యాధికారి కేంద్రంలో ప్రశ్నాపత్రాలు వర్షం నీటితో తడిశాయి
పెద్దపల్లి జిల్లా మంథని మండల విద్యాధికారి కేంద్రంలో ప్రశ్నాపత్రాలు వర్షం నీటితో తడిసిపోయాయి. శిథిలమైన భవనంలో పుస్తకాలకు, ప్రశ్నాపత్రాలకు రక్షణ లేకుండా పోయింది.
విద్యాధికారి కార్యాలయంలో తడిసిన ప్రశ్నా పత్రాలు