జీవహింస చేయకుండా శాకాహారులుగా మారాలని గోదావరిఖనిలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ సభ్యులు ర్యాలీ చేపట్టారు. రామగుండం మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ చౌరస్తా వద్దకెళ్లి ఆటపాటలతో అవగాహన కల్పించారు.
ధ్యానం చేయడం ద్వారానే సకల భోగాలు కలుగుతాయని తెలిపారు. జీవులను చంపి వాటి మాంసం తినడం వల్ల హత్య చేసినవారితో సమానమని అన్నారు. ఏ జీవినీ హింసించరాదని పాటలు పాడారు.