దేశ రాజధాని దిల్లీలో పీవీ నరసింహారావు ఘాట్‌ను ఏర్పాటు చేయాలని మంథని తెరాస నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో పీవీ శత జయంతి వేడుకల సందర్భంగా స్థానిక తెరాస నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దిల్లీలో పీవీ ఘాట్ ఏర్పాటు చేయాలి : తెరాస - పెద్దపల్లి జిల్లాలో పి వి నరసింహారావు జయంతి న్యూస్
మంథనిలో తెరాస నేతలు పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలని కోరారు.
దిల్లీలో పీవీ ఘాట్‌ను ఏర్పాటు చేయాలి : మంథని తెరాస నాయకులు
దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి... దేశాన్ని అభివృద్ధి బాటలో ముందుకు నడిపించిన మహనీయుడు పీవీ అని కొనియాడారు. ప్రభుత్వం మైనార్టీలో ఉన్నప్పటికీ 5 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన గొప్ప వ్యక్తి, అపర చాణిక్యుడు పీవీ నరసింహారావు అని... ఆయన పాలనా కాలంలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఇదీ చూడండి :తెలుగువారి ఠీవీ- మన పీవీ: 'ఈటీవీ భారత్' అక్షర నివాళి