పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటనలో ప్రొటోకాల్ వివాదం చోటుచేసుకుంది. దీంతో మంత్రి ముందే కాంగ్రెస్, తెరాస వర్గీయులు నిరసనలు తెలిపారు. మంథని మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని స్థానిక ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మంథనిలో ఈటల.. ప్రొటోకాల్ పాటించలేదని శ్రీధర్ బాబు అలక.. - మంథనిలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటన
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇదే సమయంలో ప్రొటోకాల్ పాటించలేదని స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అభ్యంతరం తెలిపారు.
మంథనిలో మంత్రి ఈటల పర్యటన.. ప్రొటోకాల్ వివాదం
దీనిపై తెరాస, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఘర్షణ జరగకుండా పోలీసులు వారిని అదుపు చేశారు. ప్రభుత్వ పథకాలు శంకుస్థాపనల్లో శిలాఫలకాలకు తెరాస రంగు వేయడం విడ్డూరంగా ఉందని శ్రీధర్ బాబు ఆరోపించారు. కనీసం ప్రొటోకాల్ పాటించాలని అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:కేటీఆర్ సొంత నిధులతో గంభీరావుపేట రైతు వేదిక నిర్మాణం