తెలంగాణ

telangana

ETV Bharat / state

మంథని పట్టణంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకులు - ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకులు

ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినం సందర్భంగా మంథని పట్ఠణంలో భాజపా నాయకులు 70కిలోల కేక్​ను కట్​ చేసి వేడుకలు జరుపుకున్నారు. దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రధాని నిర్ణయాలే కారణమని కొనియాడారు.

prime minister birthday celebrations in peddapalli district
మంథని పట్టణంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకులు

By

Published : Sep 17, 2020, 4:18 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో భాజపా నాయకులు ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాని 70వ జన్మదిన సందర్భంగా 70 కిలోల భారీ కేక్​ను పట్టణంలోని అంబేడ్కర్​ చౌరస్తాలో కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.మోదీ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరారు. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరుపుకోవాలి.. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు.

కొవిడ్​-19 దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు ముందుచూపుతో సమావేశాలు నిర్వహించి కఠినమైన నిర్ణయాలు తీసుకొని లాక్​డౌన్ నిర్వహించి.. దేశ భవిష్యత్తును, ఆర్థిక వ్యవస్థను ప్రజలను కాపాడుకున్నారని తెలిపారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు కరోనాతో ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న ఈ సమయంలో భారతదేశం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కారణం నరేంద్ర మోదీ అని కొనియాడారు.

ఇవీ చూడండి: మోదీకి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details