తెలంగాణ

telangana

ETV Bharat / state

Married Women Suicide: వరకట్న వేధింపులకు గర్భవతి, 18 నెలల పాప బలి.. - Suicide for Dowry harassment

Married Women Suicide: వరకట్న వేధింపులు తట్టుకోలేక గర్భంతో ఉన్న మహిళ తన 18 నెలల కూతురుతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన పెద్దపల్లిలో జరిగింది.

Pregnant Women and 18 months baby Suicide for  Dowry harassment at Peddapalli
Pregnant Women and 18 months baby Suicide for Dowry harassment at Peddapalli

By

Published : Feb 2, 2022, 8:40 PM IST

Married Women Suicide: అదనపు వరకట్న వేధింపులు తట్టుకోలేక తల్లి, కూతురు ఆత్మహత్మకు పాల్పడిన విషాదకర ఘటన పెద్దపల్లిలో చోటు చేసుకుంది. పట్టణంలోని భూమ్​నగర్‌లో నివసిస్తున్న చిగుర్ల మౌనిక(26) తన 18 నెలల కూతురు జున్నుతో కలిసి ఎల్లమ్మ చెరువు సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సీఐ ప్రదీప్‌కుమార్‌, ఎస్సై రాజేశ్‌.. ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీయించారు.

ధర్మారం మండలం బంజరుపల్లి గ్రామానికి చెందిన మౌనికకు సివిల్‌ సప్లయ్స్‌లో కాంట్రాక్టు పద్ధతిలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రమేశ్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వివాహం జరిగిన నాటి నుంచి వరకట్నం కోసం మౌనికను రమేశ్‌ వేధించేవాడని మృతురాలి బంధువులు పేర్కొన్నారు. బుధవారం(ఫిబ్రవరి 2న) ఉదయం కూడా ఇదే విషయమై గొడవ జరగడంతో మనస్తాపం చెందిన మౌనిక చిన్నారితో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం మౌనిక గర్భవతి కావడం మరింత విషాదకరం. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details