తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరిఖనిలో ప్రణబ్ ముఖర్జీ సంతాప సభ - pranab mukarji demise news

దేశ రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీ తనదైన ముద్ర వేశారని కొనియాడారు కాంగ్రెస్ నాయకులు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాప సభ నిర్వహించారు.

గోదావరిఖనిలో ప్రణబ్ ముఖర్జీ సంతాప సభ
గోదావరిఖనిలో ప్రణబ్ ముఖర్జీ సంతాప సభ

By

Published : Sep 1, 2020, 4:05 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో రామగుండం కార్పొరేషన్ బీసీ సెల్ అధ్యక్షుడు గట్ల రమేశ్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.

దేశ రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీ తనదైన ముద్ర వేశారని నాయకులు కొనియాడారు. క్లిష్టమైన సమస్యనైనా తన రాజకీయ చతురతతో పరిష్కారం చూపిన గొప్ప మేధావి అని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేశ్ కార్పొరేషన్ పక్ష నాయకులు మహంకాళి స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రవి కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు గాదం విజయ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముస్తఫా, ఐఎన్టీయూసీ నాయకులు లక్ష్మిపతి గౌడ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details