మరి ఇంత నిర్లక్ష్యమా...! - PRAMADAM
పెద్దపల్లి జిల్లాలో నాలుగురోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఇసుక కంకర రోడ్డుపై పడింది. ప్రమాదానికి గురైన లారీ మూల మలుపునే ఉండటం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరి ఇంత నిర్లక్ష్యమా...!
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో మంథని-పెద్దపల్లి రహదారిపై గురువారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడం వల్ల కంకర రోడ్డుపై ఇసుక చెల్లచెదురైంది. ప్రమాదానికి గురైన లారీని తొలగించలేదు. వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి రోడ్డపై ఉన్న కంకర, ఇసుకను, లారీని తొలగించాల్సిందిగా ప్రయాణికులు కొరుతున్నారు.
మరి ఇంత నిర్లక్ష్యమా...!