కరీంనగర్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ - polling mugimpu
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గత ఎన్నికల కంటే ఈ సారి పోలింగ్ శాతం మరింత తగ్గనుంది. పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినందున నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
కరీంనగర్ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 16.75 లక్షల మంది ఓటర్లకు 2,181 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేములవాడలోని అయ్యవోరిపల్లిలో మాత్రమే ఎన్నికలను బహిష్కరించారు. ఉదయం 7 నుంచి 9 వరకు మందకొడిగా సాగినా ఆ తరువాత ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివచ్చారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 75 శాతం ఓటింగ్ నమైదంది... ఈ సారి మరింత తగ్గే అవకాశముంది. నియోజకవర్గంలో పోలింగ్ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాటల్లో...