తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్లపై ఆకతాయిలు... ఐసోలేషన్ కేంద్రాలకు తరలింపు - Police sent the youth to isolation centers

నిబంధనలు అతిక్రమించిన ఆకతాయిలను పోలీసులు ఐసోలేషన్ కు పంపించిన ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండంలోని పారిశ్రామిక ప్రాంతంలో చోటుచేసుకుంది. అనవసరంగా బయటకు తిరిగితే కేసులు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

isolation
isolation

By

Published : May 27, 2021, 4:11 PM IST


కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ఆకతాయి యువకులను పెద్దపల్లి పోలీసులు ఐసోలేషన్ కేంద్రాలకు పంపించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ, గోదావరిఖనిలో పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఏసీపీ ఉమేందర్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పెట్రోలింగ్ నిర్వహించారు.

కరోనా నేపథ్యంలో ఇష్టానుసారంగా బయట తిరిగితే కేసులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ క్రమంలో సుమారు 50 మందిని ఐసోలేషన్ కేంద్రాలకు పంపించారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారి నికిత పంత్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, సీఐలు, ఎస్ఐలు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details