తెలంగాణ

telangana

ETV Bharat / state

బిట్టు శ్రీను కస్టడీ కోసం మంథని కోర్టులో పోలీసుల పిటిషన్ - బిట్టు శ్రీను

న్యాయవాద దంపతుల హత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేసులో ఇప్పటికే ముగ్గురిని కస్టడీకి తీసుకున్న పోలీసులు... నాలుగో నిందితుడు బిట్టు శ్రీనును కూడా కస్టడీకి ఇవ్వాలని మంథని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Police petition in Manthani court for Bittu Srinu custody
Police petition in Manthani court for Bittu Srinu custody

By

Published : Feb 27, 2021, 2:47 PM IST

న్యాయవాద దంపతుల హత్య కేసులో నాలుగో నిందితుడు బిట్టు శ్రీనును కస్టడీకి కోరుతూ పోలీసులు మంథని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బిట్టు శ్రీనును 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను మంథని కోర్టు విచారించనుంది.

ఇదే కేసులో ముగ్గురు నిందితులను వారం రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు వామన్‌రావు దంపతుల హత్యకేసులో మరిన్ని ఆధారాలు రాబడుతున్నారు.

ఇదీ చదవండి:పోలీస్​స్టేషన్​కని వెళ్లింది.. అదృశ్యమైంది!​

ABOUT THE AUTHOR

...view details