తెలంగాణ

telangana

ETV Bharat / state

lock down: ఆకతాయిలను ఐసోలేషన్​ వార్డుకు తరలించిన పోలీసులు - తెలంగాణ వార్తలు

లాక్​డౌన్​(lock down) నిబంధనలు ఉల్లంఘించిన ఆకతాయిలపై పోలీసులు చర్యలు చేపట్టారు. అనవసరంగా బయటకు వచ్చిన వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అనంతరం వారికి ర్యాపిడ్ టెస్టులను నిర్వహిస్తామని తెలిపారు.

peddapalli Police, lock down
పెద్దపల్లి పోలీసులు, లాక్​డౌన్

By

Published : May 30, 2021, 1:46 PM IST

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో లాక్‌డౌన్‌(lock down) నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న ఆకతాయిలను పోలీసులు ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఉదయం పది గంటల తర్వాత తనిఖీలు చేపట్టిన పోలీసులు… అనవసరంగా బయట తిరుగుతున్న 20 మందిని ప్రత్యేక వాహనాల్లో ఐసోలేషన్ వార్డుకు పంపించారు.

వారందరికీ ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మరింత కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చదవండి: 22 ఏళ్లలో 16 వేల శవాలకు అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details