తెలంగాణ

telangana

ETV Bharat / state

మంథనిలో కఠినంగా లాక్​డౌన్ అమలు

పెద్దపల్లి జిల్లా మంథని మండల వ్యాప్తంగా లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 దాటాక పోలీసులు రోడ్లపై తిరుగుతూ.. పహారా కాస్తున్నారు.

srtick lockdown implemented in manthani
మంథనిలో కఠినంగా లాక్​డౌన్ అమలు

By

Published : May 24, 2021, 2:31 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని మండంలోని పలు గ్రామాల్లో పోలీసులు లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఏ ఒక్కరు కూడా రోడ్లపైకి రావొద్దంటూ మైకులు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ ప్రత్యేకంగా మున్సిపాలిటీ మైకుల ద్వారా పోలీస్ వాహనాల హారన్ శబ్దాన్ని మోగిస్తూ... ప్రజలను అలర్ట్ చేస్తున్నారు.

10 దాటిన తర్వాత వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. సరైన కారణాలుంటే వదిలి పెడ్తూ... మిగిలిన వాటిని సీజ్ చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా ఎవరిని ఉపేక్షించేది లేదని... ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని మంథని సీఐ సతీష్ కోరారు. లాక్​డౌన్ వల్ల పోలీసుల ఆంక్షలతో పది తర్వాత మంథని మండల వ్యాప్తంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.

ఇదీ చదవండి :రెండు రోజులుగా కఠినంగా లాక్​డౌన్​ అమలు

ABOUT THE AUTHOR

...view details