పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో లాక్డౌన్(lock down) సడలింపు సమయం ముగిసిన తర్వాత తెరచిన షాపులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనవసరంగా బయటకు వచ్చిన 15 మందిపై పెట్టి కేసు పెట్టారు.
lock down: నిబంధనలు ఉల్లంఘించిన 15మందిపై కేసు - manthani latest news
లాక్డౌన్(lock down) నిబంధనలు ఉల్లంఘించిన 15 మందిపై పెద్దపల్లి జిల్లా మంథని పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయం పది గంటల తర్వాత అనవసరంగా బయటకు రావొద్దన్నారు. వస్తే కేసులతో పాటు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
lock down: నిబంధనలు ఉల్లంఘించిన 15మందిపై కేసు
లాక్డౌన్(lock down)కు ప్రజలు సహకరిస్తున్నారని మంథని ఎస్ఐ చంద్ర కుమార్ చెప్పారు. కొంతమంది ఆకతాయిలు అనవసరంగా బయటకు వస్తున్నారని తెలిపారు. ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే సుల్తానాబాద్ ఐసోలేషన్ సెంటర్కు తరలిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:Covid Crisis: కరోనాతో ప్రాణనష్టం, ఆర్థిక ఇబ్బందులు