తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుపేదలకు పోలీసుల ఆపన్నహస్తం

లాక్​డౌన్​ నేపథ్యంలో నిరుపేదలను ఆదుకునేందుకు పోలీసులు కూడా ముందుకొస్తున్నారు. పెద్దపల్లి మంథని మండలం అడవి సోమనపల్లి గ్రామంలో మంథని సీఐ, సీఆర్​పీఎఫ్​ సిబ్బంది పేదలకు నిత్యావసర సరకులను అందజేశారు.

By

Published : Apr 27, 2020, 6:23 PM IST

police distributed basic needs in peddapalli district
నిరుపేదలకు పోలీసుల ఆపన్నహస్తం

మేముసైతం అంటూ పోలీసులు కూడా పేదలకు ఆపన్నహస్తాన్ని అందిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమనపల్లి గ్రామంలో పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. మంథని సీఐ మహేందర్, సీఆర్​పీఎఫ్ సిబ్బందితో కలిసి అడవి సోమనపల్లి గ్రామంలో నిరుపేదలైన 80 మంది కుటుంబాలకు పది కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులతో పాటు శానిటైజర్లు, మాస్కులను అందజేశారు.
లాక్​డౌన్​ సందర్భంగా మంథని పోలీసులు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ నిరుపేదలను ఆదుకుంటున్నారు.

ఇవీ చూడండి: అక్కడి విద్యార్థులకు వైరస్​.. తబ్లీగీలే కారణం!

ABOUT THE AUTHOR

...view details