పెద్దపెల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో పేకాటరాయుళ్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నిత్యం పేకాట ఆడుతున్న 176 మందిని అరెస్టు చేసినట్లు సీపీ సత్యనారాయణ వెల్లడించారు. జీవితంలో పేకాట ఆడమని పేకాట రాయుళ్లతో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. మళ్లీ ఎవరైనా పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాన నిదింతులను 20 మందిని గుర్తించినట్లు తెలిపిన సీపీ... త్వరలోనే వారిని అరెస్టు చేస్తామన్నారు. ఈ సంవత్సరం 347 కేసు నమోదు చేసి 2067 మందిని అరెస్టు చేసి... వారి వద్ద నుంచి సుమారు రూ. 60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
'పేకాట ఆడి కుటుంబాలను రోడ్డు మీదికి లాగొద్దు' - POLICE COUNSELLING TO PEKATA RAYULLU IN RAMAGUNDAM
పేకాటకు బానిసై విలువైన జీవితాన్ని తాకట్టుపెట్టి కుటుంబాన్ని రోడ్డుపాటు చేయకూడదని సీపీ సత్యనారాయణ సూచించారు. రామగుండం కమిషనరేట్లో పేకాట రాయుళ్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
!['పేకాట ఆడి కుటుంబాలను రోడ్డు మీదికి లాగొద్దు' POLICE COUNSELLING TO PEKATA RAYULLU IN RAMAGUNDAM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5511115-thumbnail-3x2-ppp.jpg)
POLICE COUNSELLING TO PEKATA RAYULLU IN RAMAGUNDAM