పెద్దపెల్లి జిల్లాలో మావోయిస్టులపై నిఘా పెంచామని, గిరిజనులెవరైనా వారికి సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీపీ రవీందర్ యాదవ్ హెచ్చరించారు. ముత్తారం మండలం పారుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని శాలగుండ్లపల్లి గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సోదాలు చేశారు. రాష్ట్రంలో మావోయిస్టులు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, కేవలం వారి ప్రాబల్యాన్ని చాటుకునేందుకు తిరుగుతూ డబ్బులు ఇవ్వని వారిని హతమారుస్తున్నారని డీసీపీ రవీందర్ యాదవ్ అన్నారు.
'మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవు' - telangana varthalu
పెద్దపల్లి జిల్లాలోని శాలగుండ్లపల్లి గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టులపై నిఘా పెంచామని, ఎవరైనా వారికి సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీపీ రవీందర్ యాదవ్ హెచ్చరించారు.
జిల్లాలో మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు కౌంటర్ యాక్షన్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మంథని డివిజన్లో అటవీ ప్రాంతం అధికంగా ఉండటం వల్ల మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భూపాలపల్లి జిల్లా మీదుగా మావోయిస్టులు పెద్దపెల్లి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. ప్రజలు వారికి భయపడి డబ్బులు ఇచ్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంథని సీఐ ఆకునూరి మహేందర్, ముత్తారం ఎస్సై చాందా నరసింహారావు , మంథని ఎస్సై ఓంకార్ యాదవ్, రామగిరి ఎస్సై మహేందర్ యాదవ్‌తో పాటు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'వంటిమామిడిలో 50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తాం'