పెద్దపల్లిలో ప్రాంక్ వీడియోను (prank video) తలపించే సీన్ ఇది. కరోనా ఫస్ట్‌వేవ్ లాక్‌డౌన్ (lockdown) సమయంలో ఇలాంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో (social media) హల్చల్ చేశాయి. కొందరు ప్రాంక్ వీడియోలు రూపొందించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. పెద్దపల్లిలో మాత్రం పోలీసులు దీన్ని నిజం చేశారు.
క్షమించమని వేడుకున్నా..
లాక్‌డౌన్ ఉల్లంఘించొద్దని పదేపదే చెబుతున్నా పెడచెవిన పెడుతున్న (lockdown rules violators) యువకులకు గుణపాఠం చెప్పారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాళ్లను గుర్తించి ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. పోలీసులు లాక్కెళ్తుండగా యువకులు క్షమించమని వేడుకున్నారు. పోలీసులు మాత్రం వదలకుండా వాహనంలో తరలించారు.
మంచిర్యాలలోనూ..
మంచిర్యాల పోలీసులూ ఇదే తరహా శిక్షలు విధించాలని నిర్ణయించారు. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్న ఆకతాయిలను (lockdown rules violators) గుర్తించి కొవిడ్ ఐసోలేషన్ కేంద్రానికి (covid isolation centers) తరలిస్తామని తెలిపారు. కొందరు యువకులను వ్యాన్ ఎక్కించిన పోలీసులు.. బెల్లంపల్లిలోని జిల్లా కొవిడ్ ఐసోలేషన్ సెంటర్‌కు తరలిస్తామని తెలిపారు.