కాళేశ్వరం బ్యారేజీలో భాగంగా నిర్మించిన సరస్వతి పంప్ హౌస్ వద్ద పైపులైన్(PipeLine) పైకి తేలింది. అన్నారం నుంచి నీటిని పార్వతీ బ్యారేజీలోకి ఎత్తిపోయడానికి పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద ఈ పంప్‌హౌస్ నిర్మించారు. 12 మోటర్లకు గాను 24 లైన్ల చొప్పున భూమిలో నుంచి పైపులైన్లు వేశారు. ఈ పైపులు దాదాపు 10 నుంచి 15 ఫీట్ల ఎత్తుగల వ్యాసార్థం కలిగి ఉన్నాయి. ఇవి పంప్‌హౌస్ నుంచి బ్యారేజీ వరకు మధ్యలో సగం వరకు ఒక పైపు లైన్ అకస్మాత్తుగా మట్టితో సహా బయటకు వచ్చాయి. ఐతే గత నెలలో ఒకసారి బ్యారేజ్ వద్ద పైపు పైకి రాగా.. గుత్తేదారు సంస్థ అధికారులు మట్టి పోసి కప్పిఉంచారు.
- ఇదీ చదవండి :కష్టాల కడలిని దాటి.. పతకం గెలిచి