కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే-2019లో పెద్దపల్లి జిల్లా జాతీయస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచింది. దేశంలోనే ఉత్తమ జిల్లాల కేటగిరీలో ‘స్వచ్ఛభారత్ దివస్ అవార్డును జిల్లా సొంతం చేసుకుంది. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న అహ్మదాబాద్‌లో నిర్వహించే కార్యకమ్రంలో ప్రధాని చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అందుకోనున్నారు. స్వచ్ఛసర్వేక్షణ్-2019లో భాగంగా దేశంలోని 690 జిల్లాలు, 17,400 గ్రామాల్లో జల్‌శక్తి శాఖ బృందం సభ్యులు సర్వే నిర్వహించారు. స్వచ్ఛత, పారిశుద్ధ్యం, బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత ప్రాంతాలు, ఇంకుడుగుంతలు, పర్యావరణ పరిరక్షణ, చెత్తవ్యర్థాల నిర్వహణ వంటి పలు అంశాల్లో పెద్దపల్లి జిల్లాలో మొత్తం 1,57,893 మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ జిల్లాగా పెద్దపల్లి - స్వచ్ఛ సర్వేక్షణ్
పెద్దపల్లి జిల్లా జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ 2019లో స్వచ్ఛ భారత్ దివస్ అవార్డును పెద్దపల్లి జిల్లా సొంతం చేసుకుంది. రేపు అహ్మదాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని పెద్దపల్లి కలెక్టర్ శ్రీ దేవసేన అందుకోనున్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ జిల్లాగా పెద్దపల్లి