పెద్దపెల్లి జిల్లా మంథనిలోని రోషిణి డిగ్రీ కళాశాలలో ఫోరం ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగాఆర్డీవో నగేష్ మాట్లాడుతూ.. రాజ్యాంగం రూపొందించిన చట్టాలపై ప్రజలకు కనీస అవగాహన ఉండాలని చెప్పారు. సమాజంలో అవినీతిని నిర్మూలించి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి సమాచార హక్కు చట్టం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థులు అన్ని ప్రాథమిక హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
"ప్రాథమిక హక్కులపై అవగాహన అవసరం" - fundamental rights
ప్రాథమిక హక్కులపై ప్రతిఒక్కరికీ అవగాహన అవసరమని ఆర్డీవో నగేష్ సూచించారు. మంథనిలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
ప్రాథమిక హక్కుల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలి