పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బ్యారేజీ వద్ద నీళ్లను నిలిపివేయగా.. ఆదివారం చేపల కోసం వేలాది మంది జలాశయం వద్దకు చేరుకున్నారు. అయితే సోమవారం అధికారులు బ్యారేజీ 25 గేట్లు ఎత్తివేసి నీటిని వదలగా.. ఉదయం మత్స్యకారుల తాకిడి కొంచెం తగ్గింది. అధికారులు మధ్యాహ్నానికి అన్ని గేట్లు మూసేసి ఏడు గేట్లు మాత్రమే తెరిచి ఉంచి నీటిని దిగువకు వదులుతున్నారు. అయినా కూడా జనం.. ప్రాణాలకు తెగించి నీటిలోకి దిగి చేపల కోసం వేట కొనసాగిస్తున్నారు.
ప్రమాదమని తెలిసినా.. చేపల వేట? - poeple fishing at parvathi barrage
పెద్దపల్లి జిల్లా మంథని మండలం పార్వతీ బ్యారేజీ వద్ద సోమవారం అధికారులు 18 గేట్లు మూసివేసి.. ఏడు గేట్లలోనుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. అయినా కూడా అవేమీ పట్టనట్లు కొందరు మత్స్యకారులు నీళ్లలోకి వెళ్లి చేపలను పడుతున్నారు. వీరిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల పలువురు ఆసహనం వ్యక్తం చేశారు.
ప్రమాదమని తెలిసినా.. దురాశతో పార్వతి బ్యారేజీలో చేపల వేట
సామాజిక దూరం పాటించకుండా మాస్కులు లేకుండా చేపల కోసం ఎగబడుతున్న జనాన్ని సామాజిక మాధ్యమాల్లో చూసిన నెటిజన్లు కామెంట్లతో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. కొవిడ్ నిబంధన చర్యలు పాటించని వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.