క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో మంచిదని పెద్దపెల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. మంథని ప్రభుత్వ కళాశాల మైదానంలో గత పదిరోజులుగా స్థానిక యువకుడు ముత్కుల నరేశ్ స్మారకార్థం రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగింది. మొదటి విజేతగా నిలిచిన యాదవ్ లెవెన్ జుట్టుకు ప్రథమ బహుమతిగా రూ. 50 వేలను పుట్ట మధు చేతులు మీదుగా అందజేశారు. ద్వితీయ విజేతగా నిలిచిన డేంజర్ లెవెన్ కరీంనగర్ జట్టుకు రూ. 20వేలు అందించారు. శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయని తెలిపారు
క్రీడలతో ఆహ్లాదం, మానసికోల్లాసం: మధు - cricket tpurnament in peddapalli district
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో మంచివని పెద్దపెల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. శారీరకంగా దృఢత్వానికి దోహదపడతాయని తెలిపారు. మంథని ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో గెలిచిన జట్లకు బహుమతులు అందజేశారు.
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో మంచిది: పుట్ట మధుకర్
క్రికెట్ పోటీలకు మంథనిలో వచ్చిన ఆదరణ ఉందని పుట్ట మధు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ కళాశాల మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది... క్రీడాకారులకు ఉపయోగకరంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:సుందర యాదాద్రి: శివాలయానికి టేకు ద్వారాలు