విద్యార్ధులు రోలర్ స్కేటింగ్లో జాతీయ స్థాయిలో విజేతలుగా నిలవాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆకాంక్షించారు. క్రీడలు అడటం మూలంగా మంచి ఆరోగ్యంతో పాటు సమాజంలో గుర్తింపు లభిస్తుందని అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రోలర్ స్కేటింగ్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆయన అభినందించారు.
'క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి' - పెద్దపల్లి జిల్లా తాజా వార్తలు
క్రీడారంగంలో రాణించడం వల్ల శారీరక ఉల్లాసంతో పాటుగా ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రోలర్ స్కేటింగ్లో ప్రతిభ కనబర్చిన విద్యార్ధులను ఆయన అభినందించారు.
!['క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి' peddapelli mla call for we need to excel in sports and bring good name to the district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10272738-220-10272738-1610865506721.jpg)
'క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి'
క్రీడారంగంలో రాణించడం వల్ల శారీరక ఉల్లాసంతో పాటుగా ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా విద్యార్ధులు జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లతో పాటుగా రోలర్ స్కేటింగ్ శిక్షకులు క్రిష్ణవమూర్తి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:అప్పుడు.. ఇప్పుడు.. మొదటి వరసలో ఆ ఇద్దరూ!