తెలంగాణ

telangana

ETV Bharat / state

నీటి సంరక్షణపై విద్యార్థుల అవగాహన ర్యాలీ - నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన

నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలంటూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ఇంటింట ఇంకుడు గుంతలు నిర్మించాలని కోరారు.

నీటి సంరక్షణపై విద్యార్థుల అవగాహన ర్యాలీ

By

Published : Jul 24, 2019, 5:51 PM IST

వర్షపు నీటిని ఒడిసి పట్టి జల సంరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డులతో రాజీవ్​ రహదారిపై ర్యాలీ చేశారు. వృక్షాల నరికివేత వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు అందరూ జల సంరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించి వర్షపు నీటిని ఒడిసి పట్టాలని కోరారు.

నీటి సంరక్షణపై విద్యార్థుల అవగాహన ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details