తెలంగాణ

telangana

ETV Bharat / state

సఖీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్​ సిక్తా - peddapally collector siktha patnayak latest news

మహిళలపై జరిగే హింసను నివారించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పెద్దపల్లి జిల్లా పెద్దకాల్వలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సఖీ కేంద్రాన్ని సందర్శించారు.

peddapally collector siktha patnayak visit sakhi center in pedda kalvala
సఖీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్​ సిక్తా

By

Published : Jun 10, 2020, 5:56 PM IST

పెద్దపల్లి జిల్లా పెద్దకాల్వలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సఖీ కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. కేంద్ర నిర్వహణకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరకట్న వేధింపులు, గృహహింస, లైంగిక హింస, ఆడపిల్లల రవాణా, పనిచేసే చోట వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు కౌన్సెలింగ్, న్యాయ సలహాలను అందించేందుకు సఖీ కేంద్రాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

జిల్లాలో ఇప్పటి వరకు 2 సైబర్ నేరాలు, 3 వరకట్న వేధింపులు, 106 గృహహింస, 2 మెంటల్ స్ట్రెస్, 10 మిస్సింగ్, 1 లైంగిక వేధింపుల కేసు నమోదయ్యాయని అధికారులు కలెక్టర్​కు వివరించారు. వాటిలో ఇప్పటి వరకు 66 కేసులను పరిష్కరించామని చెప్పారు. మహిళల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ 181 పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్​ సూచించారు.

ఇదీ చదవండి:అంతర్రాష్ట్ర సర్వీసులపై నిర్ణయం ఆ తర్వాతే : కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details