తెలంగాణ

telangana

ETV Bharat / state

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పుట్ట మధుకర్ - peddapalli Zp chairman Putta Madhukar

పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్ మండలం గొల్లపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధుకర్ ప్రారంభించారు. అనంతరం పరమేశ్వర జిన్నింగ్ మిల్లులో పత్తిని పరిశీలించారు.

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పుట్టా మధుకర్
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పుట్టా మధుకర్

By

Published : Nov 6, 2020, 5:00 AM IST

పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్​ మండలం గొల్లపల్లిలో పరమేశ్వర జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ ఛైర్మన్ పుట్టా మధుకర్ ప్రారంభించారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు సమకూరుస్తుందని మధుకర్ పేర్కొన్నారు.

ఆయన రైతుల పక్షపాతి..

సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, అన్నదాతలు నష్టపోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని వివరించారు. వ్యవసాయ విధానాల్లో మార్పులు చేస్తూ రైతన్న ముఖంలో ఆనందం చూడాలని కోరుకుంటున్నారని తెలిపారు.

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పుట్ట మధుకర్

వారిని ఇబ్బందులకు గురిచేయొద్దు..

ప్రస్తుత సంవత్సరంలో అధిక వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా ధాన్యాన్ని, పత్తిని కొనుగోలు చేయాలని మిల్లర్లకు సూచించారు. రైతులు కూడా నిదానంగా అధికారులు సూచించిన సమయాల్లోనే పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి సహకరించాలని కోరారు.

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పుట్ట మధుకర్

మిల్లులో ఉద్యోగాలు స్థానికులకే..

మిల్లులో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని గొల్లపల్లి గ్రామస్తులు జడ్పీ ఛైర్మన్​ను కోరారు. ఫలితంగా నిరుద్యోగులకు జీవనోపాధి లభిస్తుందన్నారు. మరోవైపు మిల్లు వల్ల ఏర్పడే దుమ్ము ధూళితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జడ్పీ దృష్టికి తీసుకెళ్లారు.

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పుట్ట మధుకర్

ఇవీ చూడండి : ట్రాఫిక్ హోంగార్డు నిజాయితీ... బంగారం అప్పగింత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details