కేసీఆర్ రైతుల పక్షపాతి అని, వారి కంట నీరు రాకుండా ప్రతి ఇంటికి పెద్ద బిడ్డగా బాధ్యత తీసుకొని అన్నదాత కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చారని పెద్దపెల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టమధు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటిక, డంపింగ్ యార్డులు సహా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
మంథని మండలంలోని నాగారం, రామగిరి మండలంలోని బేగంపేట, ముత్తారం మండలంలో మచ్చుపేట, లక్కారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మంథని మున్సిపల్ పరిధిలోని పవర్ హౌస్ కాలనీ, శ్రీరామ్ నగర్, గంగపురి ఏరియాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మున్సిపల్ ఛైర్మన్ పుట్ట శైలజ ప్రారంభించారు.