దక్షిణ భారతావనికి విద్యుత్తు వెలుగులు పంచుతున్న పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పరిశ్రమ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగంలో మరో ముందడుగు వేయనుంది. ఇప్పటికే పరిశ్రమ సమీపంలో రాజీవ్ రహదారి పక్కన 10 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తుండగా, ఇటీవల 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో కేంద్రానికి టెండరు దశ పూర్తయింది. పరిశ్రమను ఆనుకొని ఉన్న జలాశయంలో తేలియాడే సౌర ఫలకాలతో విద్యుదుత్పత్తి చేయనున్నారు. రూ.400 కోట్లతో ఎన్టీపీసీ యాజమాన్యం ఈ సౌర విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించనుంది. టెండరు దక్కించుకున్న బీహెచ్‌ఈఎల్ సంస్థ ఆధ్వర్యంలో తేలియాడే సౌర ఫలకాలతో నిర్మాణం చేపట్టనున్నారు. ఏడాది కాలంలో నిర్మాణం పూర్తి చేసేలా ఎన్టీపీసీ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎన్టీపీసీ పరిశ్రమ అవసరాల కోసం ప్లాంటు పక్కనే దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో జలాశయం నిర్మించారు. అందులో దాదాపు 300 ఎకరాల్లో నీటిపై తేలియాడే ఫలకాలు ఏర్పాటు చేయనున్నారు.
జలాశయంలో సౌర విద్యుత్ కేంద్రం - 300 ఎకరాలు
రామగుండం ఎన్టీపీసీ ఇంధన వనరుల వినియోగంలో మరో ముందడుగు సిద్ధమైంది. ఎన్టీపీసీ పరిశ్రమను ఆనుకొని ఉన్న జలాశయంలో తేలియాడే సౌర ఫలకాలతో విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. రూ. 400 కోట్లతో యాజమాన్యం ఈ సౌర విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనుంది.
తేలియాడే ఫలకాలు.. సౌర వెలుగులు
ఇవీ చూడండి : భారీ వర్షం రాబోతోంది... జాగ్రత్త సుమీ!
Last Updated : Aug 1, 2019, 3:49 PM IST