నిర్భయంగా ఓటేయండి...
పెద్దపల్లి జిల్లాలో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్ - పోలీసుల ఫ్లాగ్‌మార్చ్
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. పెద్దపల్లిలో కేంద్ర పారా మిలిటరీ బలగాలతో కలిసి ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు.
ఫ్లాగ్‌మార్చ్
ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పెద్దపల్లి ఏసీపీ వెంకటరమణారెడ్డి సూచించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు సిబ్బంది పనిచేస్తారని తెలిపారు.
ఎన్నికల్లో ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా ఓటేయాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఏసీపీ హెచ్చరించారు.
ఇదీ చదవండి :అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెరాస ప్రభుత్వ లక్ష్యం