తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యాక్సిన్ కోసం పెద్దపల్లి ప్రజల వెతలు - పెద్దపల్లిలో రెండో డోస్ టీకా

కరోనా వ్యాక్సిన్ కోసం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి జనాలు పోటెత్తారు. ఏ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించట్లేదు. గుంపులుగుంపులుగా నిల్చొని టీకా కోసం వేచిచూస్తున్నారు.

people crowd
వ్యాక్సిన్ కోసం ప్రజల ఎదురుచూపులు

By

Published : May 10, 2021, 2:20 PM IST

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా రెండో డోస్ వ్యాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే దవాఖానకు చేరుకొని క్యూలో నిల్చున్నారు. ఏ ఒక్కరు కూడా భౌతిక దూరం పాటించకుండా కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.

గంటల తరబడి క్యూలో నిల్చున్న కొంతమందికి చుక్కెదురైంది. రెండో డోస్ కోసం 28 రోజులు తర్వాత వచ్చిన వారికి వైద్యులు టీకా వేయలేదు. రెండో డోస్ టీకా ఆరు వారాల తరువాతే వేయాలని తమకు మార్గదర్శకాలు వచ్చాయని వైద్య సిబ్బంది తెలిపారు. దీంతో రెండో డోస్ టీకా కోసం వచ్చిన వారికి, వైద్య సిబ్బందికి కాసేపు వాగ్వాదం జరిగింది. ఎంతకూ వైద్యులు టీకా వేయకపోయేసరికి చేసేదేం లేక వెనుదిరిగారు.

ఇవీ చదవండి:కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న కరోనా

ABOUT THE AUTHOR

...view details