తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టర్ సిక్తా పట్నాయక్ క్షేత్రస్థాయి పర్యటన - PEDDAPALLI COLLECTRO LATEST NEWS

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కమాన్​పూర్ మండల కేంద్రంలో ఈ రోజు క్షేత్ర స్థాయిలో పర్యటించారు. కరోనా వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ప్రజలకు వివరించారు.

COLLECTRO VISITED KAMANPOOR
కలెక్టర్ సిక్తా పట్నాయక్ క్షేత్రస్థాయి పర్యటన

By

Published : Apr 17, 2020, 3:31 PM IST

పెద్దపెల్లి జిల్లా కమాన్​పూర్ మండల కేంద్రంలో జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్ శుక్రవారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. మండల కేంద్రంలోని ఎస్​బీహెచ్ బ్యాంకులో ఖాతాదారులు సామాజిక దూరం పాటించాలన్నారు. అలాగే చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బు, సానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. కరోనా వైరస్ నివారణకు ఉపయోగించే మాస్కులు కుడుతున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. కమాన్‌పూర్ నర్సరీకి వెళ్లి చూశారు.

ప్రజలందరూ తప్పకుండా మాస్కులు ధరించాలని కలెక్టర్ తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న సందర్భంలో అందరూ ఇళ్లలోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, తహసీల్దార్ బి. పాల్ సింగ్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి:లాక్​డౌన్​ వేళ 'కరోనా విందు'- ఒకరు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details