ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మంప పీఎస్ పరిధిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన మావోయిస్టు నేత సంద గంగయ్య అలియాస్ అశోక్ మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మావోయిస్టు గంగయ్య తల్లి అమృతమ్మ బోరున విలపించింది. తన కుమారుడు గంగయ్య ఎన్కౌంటర్లో మృతి చెందడం బాధాకరం అంటూ తన చిన్న కుమారుడు మహేందర్‌ను పట్టుకొని కన్నీరుమున్నీరైంది.
Encounter: మంప ఎదురుకాల్పుల్లో.. పెద్దపల్లి జిల్లా మావోయిస్టు మృతి - Peddapalli district Maoist killed in police firing at mampa of vishaka district
ఏపీలోని విశాఖ జిల్లా మంప పీఎస్ పరిధిలో జరిగిన ఎదురుకాల్పులు.. పెద్దపల్లి జిల్లాలో అలజడి సృష్టించింది. ఘటనలో తెలంగాణ వాసి చనిపోయినట్లు వార్తలు రావడంతో మృతుడి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని కుటుంబీకులు శోక సంద్రంలో మునిగిపోయారు.

పెద్దపల్లి జిల్లా మావోయిస్టు మృతి
1999లో అజ్ఞాతంలోకి వెళ్లిన గంగయ్య.. స్థానికంగా ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి రామస్వామి, తల్లి అమృతమ్మ దంపతులకు మొత్తం నలుగురు కుమారులు. పెద్ద కుమారుడు రాజయ్య మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొని 1996లో ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ప్రస్తుతం మంప ఎదురుకాల్పుల్లో మృతి చెందిన గంగయ్య వారికి రెండో కుమారుడు.
మంప ఎదురుకాల్పుల్లో.. పెద్దపల్లి జిల్లా మావోయిస్టు మృతి