పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. తమ గ్రామంలో అధ్వానంగా మారిన రహదారిని పునరుద్ధరించాలని సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ నిరసనలకు భాజపా, కాంగ్రెస్ స్థానిక నాయకులు మద్దతు తెలిపారు. కొదురుపాక గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు వెళ్లిన ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు. మనోహర్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Villagers obstruct mla convoy: ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. రాజీనామా చేయాలంటూ...
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామస్థులు ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డగించారు. రోడ్లు నిర్మించకపోతే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే కాన్వాయ్ అడ్డగింత, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి చేదు అనుభవం
ఏడేళ్లుగా గ్రామంలో రోడ్డు గుంతలమయం అయిందని.. ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి నిర్మించకపోతే రాజీనామా చేయాలని వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే కాన్వాయ్‌కు అడ్డుగా బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. అరగంట పాటు అడ్డుకోవడంతో పోలీసులు ఆందోళనకారులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో అరెస్టు చేసి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి:పేకాట కేసులో ఐదుగురు అరెస్టు.. రూ.12.66 లక్షలు స్వాధీనం