పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ, గోదావరిఖని జీఎం కాలనీలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా వారిని గాంధీకి తరలించారు. ఆ రెండు కాలనీలను రెడ్ జోన్లుగా ప్రకటించారు.
ఊపిరిపీల్చుకున్న పెద్దపల్లి వాసులు - corona free peddapalli
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీ, గోదావరిఖని జీఎం కాలనీలలో రెడ్జోన్లను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎత్తివేశారు. ఫ్రీజోన్‌గా ప్రకటించినా... ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ భౌతిక దూరం పాటించాలని సూచించారు.
గోదావరిఖనిలో కలెక్టర్ సిక్తా పట్నాయక్
14 రోజుల క్వారంటైన్ అనంతరం వారికి కరోనా నిర్ధరణ పరీక్ష చేయగా నెగిటివ్ రాగా పెద్దపల్లి ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గోదావరిఖనిలో పర్యటించి రెడ్ జోన్లను ఎత్తివేసి ఫ్రీ జోన్లుగా ప్రకటించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించి, కరోనా వైరస్‌ను నివారించాలని సూచించారు.